రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

ATP: గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా అనంతపురం రైల్వే స్టేషన్‌లో పోలీసులు శనివారం ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సాయంతో రైళ్లు, పార్శిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నార్కోటిక్స్ గుర్తింపులో శిక్షణ పొందిన 'టైగర్' అనే జాగిలంతో ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.