పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు

సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం, దామోదర, కోమటిరెడ్డి, తుమ్మల పర్యటించారు. హుస్నాబాద్‌లో రూ.11.50 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.82 కోట్లతో నిర్మించే 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు, రూ.77.2 కోట్లతో చేపట్టే కొత్తపల్లి-హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేశారు.