దర్శనానికి వెళ్లారు.. గుండెపోటుతో మరణించారు
MHBD: పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత పాకనాటి సోమారెడ్డి(72) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం పాలకుర్తి సోమేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తయిన వెంటనే సోమారెడ్డి గుండెపోటుతో ఆలయ ప్రాంగణంలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరునా విలపించారు.