స్వర్ణ పథకాన్ని సాధించిన మైనార్టీ కళాశాల విద్యార్థి

JGL: జగిత్యాలలోని తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం.డీ. అయానుద్దిన్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ - 2025లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో ఫైనల్స్‌లో ఆయన ఇరాక్ ఆటగాడిని ఓడించి అంతర్జాతీయ వేదికపై మన దేశఖ్యాతిని చాటాడు. స్వదేశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చిన అయానుద్దిన్‌ను కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు.