శింగనమల ఎంపీడీఓగా మౌనిక బాధ్యతల స్వీకరణ
ATP: శింగనమల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ) మౌనిక బుధవారం బాధ్యతలు చేపట్టారు. గ్రూప్-2 నియామకాల్లో భాగంగా జిల్లాకు కేటాయించిన ఆమెకు, ఇటీవల జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ నుంచి నియామక పత్రం అందింది. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా పని చేస్తానని పేర్కొన్నారు.