ఎమ్మెల్యేను కలిసిన క్రీడల అభివృద్ధి అధికారి
సత్యసాయి: జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తచెరువు జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియం పునర్నిర్మాణ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యేకు కిషోర్ వివరించారు. జిల్లాలో క్రీడా వేదికల అభివృద్ధికి, యువతకు అవకాశాల కల్పనకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.