టీటీడీ రిటైర్డ్ కళాకారుడికి ఉగాది పురస్కారం
తిరుపతికి చెందిన టీటీడీ రిటైర్డ్ డోలు విద్వాంసులు, ఊట్లవారిపల్లికి చెందిన ఎం.మునిరత్నాన్ని ఉగాది పురస్కారంతో సత్కరించారు. మ్యూజిక్ డోలు విభాగంలో ఆయనను పురస్కారానికి ఎంపిక చేశారు. కంచికామకోటి పీఠం ఆస్థాన విధ్వన్, ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనకు పురస్కారం రావడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.