అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం..!
AKP: గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామ పరిధిలో బోలుం చెరువు వెనుక పావాడ కృష్ణకు చెందిన పూరిల్లు మంగళవారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్నికి కారణాలు ఇంకా తెలియలేదు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.