VIDEO: గుర్రంకొండలో వరుస చోరీలు.. ప్రజల్లో భయం
అన్నమయ్య: గుర్రంకొండ పట్టణంలో వరుస చోరీలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సోమవారం, డోర్ లాక్ చేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కొత్తపేటలో ఎం.డి. పరహాద్ ఇంట్లో 50 గ్రాములు బంగారం, 450 గ్రాములు వెండి, రూ. 1 లక్ష, నబీకాలనీలో ఖాదర్ బాష ఇంట్లో 750 గ్రా వెండి, రూ. 20 వేల నగదు అపహరించారు. పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.