గంజాయి పట్టుకున్న పోలీసులకు సీపీ రివార్డులు

WGL: పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం డ్రగ్స్ కంట్రోల్ విభాగం అధికారులను రివార్డులతో సత్కరించారు. రూ. 3 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను పట్టుకోవడంలో వారు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్‌పెక్టర్ సతీష్, శివ కేశవులు, ఎస్సైలు పూర్ణ, మనోజ్, నాగరాజు, ఏఏవో సల్మాన్ పాషాను సీపీ అభినందించారు.