మేడారం గద్దెల వద్ద ప్రమాదం.. బాలుడి కాలు తొలగింపు

మేడారం గద్దెల వద్ద ప్రమాదం.. బాలుడి కాలు తొలగింపు

MLG: తాడ్వాయి మండలం మేడారం గద్దెల వద్ద రాతి శిల కూలిన ఘటనలో గాయపడిన 6 ఏళ్ల బాలుడి కాలును వైద్యులు తొలగించారు. గత నెల 25న జరిగిన ఈ ప్రమాదంలో పూజారి రమేశ్ కుమారుడు యువిన్ తీవ్రంగా గాయపడ్డాడు. హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాదాన్ని రక్షించడం సాధ్యం కాకపోవడంతో శస్త్రచికిత్స ద్వారా కాలులో కొంత భాగాన్ని తొలగించినట్లు వైద్యులు తెలిపారు.