ముమ్మరంగా.. సిల్ట్ తొలగింపు పనులు

ముమ్మరంగా.. సిల్ట్ తొలగింపు పనులు

MDCL: ఉప్పల్, నాచారం, హబ్సిగూడ ప్రాంతాలలో డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులను వేగవంతం చేసినట్లుగా HMWSSB అధికారుల బృందం తెలిపింది. ఉప్పల్ గణేష్ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, హనుమాన్ నగర్, ఈస్ట్ బాలాజీ హిల్స్, వెస్ట్ బాలాజీ హిల్స్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మిగతా ప్రాంతాల్లోనూ 20 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.