నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రకాశం: ఒంగోలు‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవాళ జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజా‌బాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు, ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.