ఈ నెల 17 వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం

ATP: గుత్తి మండలంలోని అబ్బేదొడ్డి, అనగానదొడ్డి, పెద్దొడ్డి గ్రామాల్లో ఈ నెల17 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏపీ ఎస్పీడీసీఎల్ గుత్తి డీఈఈ పిళ్లై పేర్కొన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఈ నెల14 నుంచి 17వరకూ రోజు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ కరెంట్ సరఫరా నిలిపివేస్తామన్నారు.