VIDEO: నీళ్లు కలిసిన పెట్రోల్ విక్రయం
CTR: సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లె ఓ పెట్రోల్ బంకులో నీళ్లు కలిసిన పెట్రోల్ విక్రయిస్తున్నట్లు వినియోగదారులు శనివారం ఆరోపించారు. దీనిపై సిబ్బందిని విచారించగా రాత్రి వచ్చిన స్టాక్ అని వెల్లడించారు. ఈ పెట్రోల్ వినియోగించిన పలు వాహనాలు నిలిచిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు విచారించి వివరాలు వెల్లడించాల్సి ఉంది