మల్లికాంబ మనోవికాస కేంద్రంలో వేడుకల్లో ఎమ్మెల్యే

మల్లికాంబ మనోవికాస కేంద్రంలో వేడుకల్లో ఎమ్మెల్యే

HNK: అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.