మానవత్వం చాటుకున్న రాజోలు సీఐ

కోనసీమ: రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన ఇంగువ లక్ష్మీ వినయ్ కుమార్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకుని తనవంతు సాయంగా వారి కుటుంబ సభ్యులకు రూ. 10,000 అందజేసి మానవత్వం చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా వారికి ఏ అవసరం వచ్చిన సహాయం చేస్తానని తెలిపారు.