VIDEO: కోతులు బెడద.. భయాందోళన ప్రజలు
ELR: ఉంగుటూరు గ్రామములో కోతులు బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ ఉదయమే కోతులు ఇళ్ల వద్దకు చేరి ఇంటిలోని సామాన్లను చెల్లాచెదురు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మండలంలో చేబ్రోలు, కైకరం, బాదంపూడి, నారాయణపురం, తదితర గ్రామాలలో కోతులు బెడదతో ఎక్కువగా ఉందని వారు వాపోతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు కోతులను పట్టుకుని అడవిలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు.