'ఎలాంటి పోరాటాలు చేసినా మా పార్టీ మద్దతు ఉంటుంది'
MBNR: బంజారాహిల్స్‌లోని కళింగ భవన్‌లో నిర్వహించిన బీసీ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితేనే రాజ్యాంగ బద్ధమైన హక్కులు కలుగుతాయని, రాజ్యాంగ సవరణ చేస్తేనే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఒత్తిడి పెంచే దిశగా చేయాలన్నారు.