ఆలయ కమిటీకి చెక్కును పంపిణీ చేసిన ఎంపీ

కృష్ణా: మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి వారికి గొల్లపూడిలో ఉన్న 40 ఎకరాల భూములను విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీకి రూ.45 లక్షల చెక్కును ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆలయ కమిటీ, నేతలు పాల్గొన్నారు.