VIDEO: మున్సిపాలిటీలో పోలీసులు ముమ్ముర వాహన తనిఖీలు
AKP: నర్సీపట్నం అబిడ్స్ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం టౌన్ పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. సీఐ షేక్ గఫూర్ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై రమేష్ చేపట్టిన తనిఖీలలో పలువురు వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దొరికిపోయారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రికార్డులు లేని వారిపై తక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.