నమ్మకానికి ప్రతీక హనుమంతుడు: MLA
MBNR: ధైర్యం, భక్తి, నిబద్ధత, నమ్మకానికి హనుమంతుడు ప్రతీకగా నిలిచాడని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రామ్ మందిర్ చౌరస్తాలో నిర్వహించిన శోభయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలుచేసి మాట్లాడారు. ప్రజలందరూ శాంతి, సౌబ్రాత్రుత్వంతో పండుగలను జరుపుకుంటూ ఐక్యతగా నిలబడాలని పిలుపునిచ్చారు. మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేంధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
.