దారుణం.. కూతురిని చంపిన కసాయి తండ్రి
మార్కాపురం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి తన కన్న కూతురిని హత్య చేశాడు. అతడి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని తులసి (9) అనే చిన్నారిని గొంతు నులిమి హత్య పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో చిన్నారి విగత జీవిగా పడి ఉండటం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.