రిమోట్ కారులో బుజ్జి గణపతి ఊరేగింపు

రిమోట్ కారులో బుజ్జి గణపతి ఊరేగింపు

GNTR: మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో బుజ్జి గణపతి ఊరేగింపు వినూత్నంగా జరిగింది. నాలుగు రోజుల పూజల అనంతరం ఆదివారం చిన్నారులు రిమోట్ కంట్రోల్ కారులో బుజ్జి గణపతిని ఊరేగించారు. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ కేరింతలు కొడుతూ చిన్నారులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికులు ఈ ఊరేగింపును ఆసక్తిగా వీక్షించారు.