వికలాంగులకు కిట్లు అందజేసిన ఎమ్మెల్యే

SKLM: చెవిటి, మూగ వారికి అవసరమైన పరికరాలను శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ MLA గొండు శంకర్ హాజరయ్యారు. చెవిటి, మూగ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి తగిన పరికరాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.