కోదాడ ఉత్సవాలలో గన్నవరం ఎమ్మెల్యే

కృష్ణా: కోదాడ నియోజకవర్గం మేళ్ల చెరువు గ్రామంలో శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవ జాతర వైభవంగా నిర్వహించారు. గురువారం రాత్రి గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు.