ప్రమాదాలకు అడ్డగా భువనగిరి-జగదేవ్పూర్ వైవే

ప్రమాదాలకు అడ్డగా భువనగిరి-జగదేవ్పూర్ వైవే

భువనగిరి-జగదేవ్పూర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఈ రహదారిపై ప్రతి రోజు భారీ వాహనాలు, కార్లు, దిచక్రవాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. రోడ్డుపై గుంతలు పడటం, ఒన్ వే కావడంతో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో కూడా రోడ్డుపై లైట్లు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమని ప్రయాణికులు చెప్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.