రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ELR: ఉండి మండలం పెద్దపేటకు చెందిన బేతపూడి రవి (30) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆకివీడు నుంచి కైకలూరు వైపు వెళ్తుండగా ఆటపాక వద్ద బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.