ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
NLG: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన నిడమనూరు (M) వడ్డెరిగూడెంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. UPకి చెందిన సురేష్ (35) వరి కోత మిషన్ డ్రైవర్ పొలాలను కోసేందుకు రాగా, నిన్న చైన్ కోత మిషన్‌ను తరలించేందుకు ట్రాలీ ట్రాక్టర్ తీసుకెళ్లాడు. రోడ్డు సరిగా లేక అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.