నిప్పుల కొలిమిలా ఎండ..!
MLG: జిల్లాలో భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. ప్రజలు భయటకు రావాలంటే జంకుతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. ఈ ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలకు అత్యవసర పరిస్థితి ఉంటే తప్పా భయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.