వైస్ ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు నమోదు
MBNR: జడ్చర్లలోని ఓ గురుకుల పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినిని ఏడాది పాటు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన నేరాల అవగాహన సదస్సులో విద్యార్థి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చింది. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు.