గాజులపల్లెలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

గాజులపల్లెలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

NDL: మహానంది మండలం గాజులపల్లెలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం, ఎదురుకోలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులందరూ పాల్గొని బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.