BREAKING: తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.1,800 తగ్గి రూ.1,48,200గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.