చిత్తూరులో విస్తృతంగా పోలీసుల తనిఖీ

చిత్తూరులో విస్తృతంగా పోలీసుల తనిఖీ

CTR: ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.