'పత్తి కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలి'
NRML: పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీసీఐ సంస్థ సమయానికి కొనుగోళ్లు ప్రారంభించి రైతుల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.