విద్యార్థులను అభినందించిన అసిస్టెంట్ కలెక్టర్
KKD: పిఠాపురం RRBHR ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా అభినందించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14-20 మధ్య ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పాలనపై అవగాహన పెంచుకుంటూ చురుగ్గా పాల్గొన్న విద్యార్థులను, కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన అధికారులను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.