ఖో ఖో సెలక్షన్ల తేదీల్లో మార్పు
సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ ఖోఖో సెలక్షన్స్ టోర్నమెంట్ తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అండర్- 14, 17 విభాగాల బాలురకు ఈ నెల 11న, బాలికలకు 12న సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.