నీటిలో ఊపిరి ఆడక బాలుడు మృతి
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కొండూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మాగల్లు జడ్పీ హైస్కూల్లో చదువుతున్న దినకరన్ అనే బాలుడు స్నేహితులతో కలిసి వాగులో దిగాడు. ఆ బాలుడు నీటిలో ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయాడు. స్నేహితుల కేకలతో గ్రామస్థులు అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.