'సీతక్కపై అసత్య ఆరోపణలు మానుకోవాలి'
MLG: మంత్రి సీతక్కపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులు బాధ్యతతో మాట్లాడాలని, అసత్య ప్రచారాలు నిలిపివేయాలని సూచించారు. అంగన్వాడీ పోషణ్ అభియాన్ టెండర్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేకపోతే ప్రజల ముందు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.