తిరుపతి ప్యాసింజర్ రైల్లో వ్యక్తి మృతి
అనంతపురం: తిరుపతి నుంచి హుబ్లీ వెళ్లే ప్యాసింజర్ రైలులో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. తోటి ప్రయాణికులు గుంతకల్ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.