కోతికొండలో 'పల్లె నిద్ర' కార్యక్రమం

కోతికొండలో 'పల్లె నిద్ర' కార్యక్రమం

KRNL: తుగ్గలి మండలం కోతికొండలో సీఐ పులి శేఖర్ గౌడ్ బుధవారం రాత్రి 'పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టారు. గ్రామస్థులతో సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. సమస్యలుంటే తమను ఆశ్రయించాలన్నారు.