'మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతో అవసరం'

'మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతో అవసరం'

W.G: మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతో అవసరమని ఎస్సై మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా శక్తి యాప్, మహిళల భద్రతా చర్యలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రతాపరమైన సమస్యలను ఈ యాప్ ద్వారా సులభతరంగా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి రక్షణ పొందవచ్చునన్నారు.