VIDEO: శివాలయం నిర్మాణం కోసం భూమి పూజ
GDWL: వడ్డేపల్లి మండలం జుల్లేకల్ గ్రామంలో ఇవాళ శివాలయ నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం గ్రామ పెద్దలు, భక్తులు కలిసి ఆలయ నిర్మాణానికి కావాల్సిన పనులు, నిధుల సమీకరణ, తదుపరి ప్రణాళికల గురించి వివరంగా చర్చించారు.