'SSMB29'పై రాజమౌళి స్పెషల్ వీడియో
'SSMB 29' చిత్రానికి సంబంధించిన 'GLOBETROTTER' ఈవెంట్ ఈనెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించి రాజమౌళి స్పెషల్ వీడియో షేర్ చేశాడు. 'ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. 18 ఏళ్లలోపు వారికి, సీనియర్ సిటిజన్స్‌కు అనుమతి లేదు. మీ ఎంట్రీ పాస్‌లోని సూచనలను ఫాలో అవ్వండి' అని తెలిపాడు.