సర్పంచ్ భర్త కిడ్నాప్.. పలువురు అరెస్ట్

సర్పంచ్ భర్త కిడ్నాప్.. పలువురు అరెస్ట్

KMM: ముదిగొండ మండలం పండ్రెగుపల్లి గ్రామ సర్పంచి భర్త పాము సిల్వరాజు కిడ్నాప్‌ కేసులో 10 మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ కిడ్నాప్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.