నక్కపల్లి బాలుడు అదృశ్యం

నక్కపల్లి బాలుడు అదృశ్యం

AKP: నక్కపల్లి మండలం ఉపమాక శివారు మనబాలవానిపాలెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల మనబాల రమేశ్ ఈనెల 9వ తేదీ నుంచి కనుమరుగయ్యాడు.తల్లిదండ్రులు వీరలక్ష్మి, గంగారావు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోయాడని తెలిపారు. సీఐ మురళి ఆధ్వర్యంలో బాలుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా అతన్ని చూసినట్లయితే, వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.