VIDEO: స్వర్ణగిరిలో ఉగాది వేడుకలు
BHNG: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. నిర్వాహకులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరికీ ఉగాది పచ్చడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.