ఇనాక్‌కు గురజాడ విశిష్ట సాహితీ పురస్కారం
VZM: సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు గురజాడ విశిష్ట సాహితీ పురస్కారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ అందజేశారు. ఆదివారం విజయనగరం క్షత్రియ కల్యాణ మండపంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత, కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.