గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం

కృష్ణా: మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేశ్ బాబు విమానాశ్రయంలో చిరంజీవిని గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.