'కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి'
TG: HYDలో జరుగుతున్న కోటి దీపోత్సవంపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దీపోత్సవం కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా, దేశం మొత్తం గర్వపడే జాతీయ పండగగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ వేడుక భక్తి సౌరభంతో కొనసాగుతుందని ప్రశంసించారు. రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే జాతీయ గుర్తింపు ఇవ్వటానికి చర్యలు చేపడతామని చెప్పారు.